Atyunnata Simhaasanamupai -Telugu Christian Song

అత్యున్నత సింహాసనముపై  ఆసీనుడై యున్న దేవా

అత్యంత ప్రేమా స్వరూపివి  నీవే  ఆరాధింతును నిన్నే

అహాహా…హల్లెలూయా  అహాహా…హల్లెలూయా   || 7 || అహాహా…మేన్

ఆశ్చర్యకరుడా స్తోత్రం  ఆలోచనకర్తా స్తోత్రం

బలమైన దేవా నిత్యుడవగు తండ్రీ  సమాధాన అధిపతి స్తోత్రం

|| అహాహా ||

క్రుపా సత్య సంపూర్ణుడా స్తోత్రం  క్రుపతో రక్షించితివే స్తోత్రం

నీ రక్తమిచ్చి విమోచించినావే  నా రక్షణకర్తా స్తోత్రం  || అహాహా ||

ఆమెన్ అనువాడ స్తోత్రం  అల్ఫా ఓమెగా స్తోత్రం

అగ్నిజ్వాలల వంటి కన్నులు గలవాడ  అత్యున్నతుడా స్తోత్రం

|| అహాహా ||