1.అందాలతార అరుదెంచె నాకై – అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి -అవని చాటుచున్
ఆనందసంద్ర ముప్పోంగెనాలో – అమరకాంతిలో
ఆది దేవుని జూడ – అశింపమనసు – పయనమైతిమి ll అంll
2. విశ్వాసయాత్ర – దూరమెంతైన – విందుగా దోచెను
వింతైన శాంతి – వర్షంచెనాలో – విజయపధమున
విశ్వాలనేలెడి – దేవకుమారుని – వీక్షించు దీక్షలో
విరజిమ్మె బలము – ప్రవహించె ప్రేమ – విశ్రాంతి నొసగుచున్ ll అంll
3. యెరూషలేము – రాజనగరిలో – ఏసును వెదకుచు
ఎరిగిన దారి – తొలగిన వేల – ఎదలో క్రంగితి
ఏసయ్యతార – ఎప్పటివోలె – ఎదురాయె త్రోవలో
ఎంతో యబ్బురపడుచు – విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకుll అంll
4. ప్రభుజన్మస్ధలము – పాకయేగాని పరలోక సౌధమే
బాలునిజూడ – జీవితమెంత – పావనమాయెను
ప్రభుపాదపూజ – దీవెనకాగా – ప్రసరించె పుణ్యము
బ్రతుకె మందిరమాయె – అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన ll అంll