దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహొవా
సంస్తుతి చేయవే మనసా = దేవ సంస్తుతి చేయుమా నా
జీవమా యెహొవా దేవుని పావన నామము నుతించుమా
నా యంతరంగము లో వసించునో సమస్తమా !!దేవ!!
1. జీవమా, యెహొవా నీకు జేసిన మేళ్లన్ మరవకు
నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు – లేవియున్
లేకుండ జేయును ఆ కారణముచే !!దేవ!!
2. చావు గోతినుండి నిన్ను లేవనెత్తి దయను గృపను
జీవ కిరీటముగ వేయును నీ శిరసు మీద జీవ కిరీటముగ
వేయును ఆ కారణముచే !!దేవ!!
౩. యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనె క్రొత్త
యౌవనంబై వెలయునట్లుగ మే లిచ్చి నీదు
భావమును సంతుష్టిపరచునుగా ఆ కారణముచే !!దేవ!!